![]() |
![]() |
.webp)
శ్రీముఖి కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సెట్ లో ఖాళీగా ఉండడంతో ఇమ్మానుయేల్ తో ముచ్చట్లే పెట్టింది. "మీ ఛానల్ లో కుకింగ్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు అని అందరూ అడుగుతున్నారు" అంటూ శ్రీముఖి ఇమ్ముని అడిగింది. "అంతకు ముందు నా ఛానల్ లో చేశా. ఐతే ఆ ఛానెల్ ఎగిరిపోయింది..కొన్ని కారణాల వలన స్ట్రైక్స్ పడి లక్షా 95 వేల సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు..ఆ ఛానెల్ ఎగిరిపోయింది " అని చెప్పాడు. "నేనసలు అమ్మాయిలు, అబ్బాయిలు ఎగిరిపోతారని అనుకున్నాను కానీ ఛానెల్స్ ఎగిరిపోతాయని తెలీదు" అంది శ్రీముఖి. దాంతో ఇమ్ము "ఛానెల్ బ్లాక్ అయ్యింది. తర్వాత నేనొక వెబ్ సిరీస్ తీసి ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశా. దానికి లక్షా 50 వేల మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు..కానీ కుదరట్లేదు అక్కా చేయడానికి..అమ్మాయిలంటే అందానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తారు" అని చెప్పాడు. "నువ్వు కూడా గ్లామర్ గానే ఉంటావ్ కదా గ్లామర్ రిలేటెడ్ టిప్స్ చేయొచ్చుగా" అని అడిగింది. "నాకు వ్లాగ్స్ చేయడం ఇష్టం ఉండదు. నేను ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా" అని చెప్పాడు. " నీ కథలో హీరోయిన్ ఎవరు" అని అడిగింది. " నా కథలో ఒక అందమైన అమ్మాయి హీరోయిన్ గా వుంటే బాగుంటుంది" అన్నాడు.
"దెబ్బాజానీనా..మా ఇమ్మానుయేల్ కి దెబ్బజానీకి ఎవరికీ తెలియకుండానే ఒక సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తోంది..దెబ్బాజానీ అని ఎందుకు అంటున్నానంటే యాదమ్మరాజుకు డెబ్జానీ అనడం రాక దెబ్బజానీ" అన్నాడు అని చెప్పింది శ్రీముఖి. "డెబ్జానీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది నాకు" అన్నాడు ఇమ్ము. దాంతో " ఒక ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ చెప్పిన తన లైఫ్ స్టోరీ డెబ్జానీ ఫ్లాట్ ఐపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది." అని చెప్పింది శ్రీముఖి. "డెబ్జానీ చాలా ఎమోషనల్ అయ్యింది. చాలా మంచి అమ్మాయి" అన్నాడు ఇమ్ము. "మరి నీ వేస్ట్ ఫెల్లోని పక్కన పెట్టేసి డెబ్జానీకి లైఫ్ ఇవ్వాలని నీకు అనిపించడం లేదా" అని అడిగింది శ్రీముఖి. " అమ్మో నేను టోటల్ గా పక్కకెళ్ళిపోతాను" అన్నాడు ఇమ్ము.
![]() |
![]() |